| Daily భారత్
Logo




కేటీఆర్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు

News

Posted on 2025-06-14 10:24:57

Share: Share


కేటీఆర్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు

డైలీ భారత్, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌న్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.రేవంత్ రెడ్డిని కించపరిచేలా, ఆయన ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ తన ఫిర్యాదులో ఆరోపించారు. కేటీఆర్ చేసిన నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలతో కూడిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై మాజీ సీఎం కేసీఆర్‌ను విచారణ కమిషన్ ప్రశ్నిస్తున్న సున్నితమైన తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజా శాంతికి భంగం కలిగించే ప్రమాదం ఉందని ఫిర్యాదులో వివరించారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా పలు సోషల్ మీడియా పోస్టులను కూడా ఆధారాలుగా సమర్పించారు.అందుకున్న ఫిర్యాదు, సాక్ష్యాధారాల ఆధారంగా పోలీసులు కేటీఆర్‌పై భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్లోని సెక్షన్ 353(2) ప్రజా శాంతికి భంగం కలిగించే ప్రకటనలు చేయడం, సెక్షన్ 352 శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం కింద కేసు నమోదు చేశారు.

Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >
Image 1

నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్

Posted On 2026-06-18 18:21:32

Readmore >
Image 1

రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-06-18 17:26:43

Readmore >
Image 1

ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే తొలగించాలి

Posted On 2026-06-18 17:16:48

Readmore >