Posted on 2025-06-13 18:31:57
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేబినెట్ విస్తరించిన సీఎం రేవంత్ రెడ్డి.. తాజాగా మంత్రులకు జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు కేటాయించారు.
కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన ముగ్గురికి జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడంతో పాటు కొందరు పాత మంత్రుల జిల్లాల్లో మార్పులు చేర్పులు చేశారు. ఈ మేరకు గురువారం (జూన్ 12) సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే అమాత్య బాధ్యతలు స్వీకరించిన మంత్రి గడ్డం వివేక్‌ను మెదక్ జిల్లా ఇంచార్జ్‌గా నియమించారు.
దామోదర రాజనర్సింహా మహబూబ్ నగర్, శ్రీధర్ బాబు రంగారెడ్డి, పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్, సీతక్క నిజామాబాద్, జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్, తుమ్మల నాగేశ్వర్ రావు కరీంనగర్, వాకిటి శ్రీహరి ఖమ్మం, అడ్లూరి లక్ష్మణ్‌కు నల్గొండ జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. గతంలో సీతక్క ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్‌గా ఉండగా.. ఆమెను ఇప్పుడు నిజామాబాద్‌కు మార్చారు.
నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్ ఇంచార్జ్ అపాయింట్ చేశారు. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దగ్గర ఉన్న ఖమ్మం జిల్లా ఇంచార్జ్ బాధ్యతలను ఇటీవల మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వాకిటి శ్రీహరికి కేటాయించారు. నల్లగొండ జిల్లా ఇంచార్జ్‌గా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావును కరీంనగర్‌కు ట్రాన్స్ఫర్ చేసి.. నల్లగొండ జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు అడ్లూరి లక్ష్మణ్‌కు అప్పగించారు. మెదక్ జిల్లా ఇంచార్జ్ బాధ్యతల నుంచి మంత్రి సురేఖను తప్పించి.. ఎమ్మెల్యే వివేక్‌కు అప్పగించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ వద్ద ఏ జిల్లా బాధ్యతలు లేవు.
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >