Posted on 2025-06-08 04:39:59
డైలీ భారత్, జయశంకర్ భూపాలపల్లి: పెళ్లికోసం వెళ్లిన యువకులు సరదాకు గోదావరినదిలో స్నానం చేసేందుకు వెళ్లి మృత్యువాత పడిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 6 గురు యువకులు గల్లంతవడం తో విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహదేవ్పూర్ మండలం అంబట్పల్లికి చెందిన గొలుకొండ మల్లయ్య ఇంట్లో ఇటీవల వివాహం జరిగింది. ఈ వివాహానికి హాజరైన బంధువుల్లో ఎనిమిది మంది శనివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో అంబట్పల్లి నుంచి ఆటోలో మేడిగడ్డకు వెళ్లారు.
గోదావరిలో స్నానం చేయడానికి అని వెళ్లిన వారిలో మొదట పట్టి మధుసూదన్ అనే యువకుడు నదిలోకి దిగాడు. అయితే అక్కడే ఉన్న గుంతను గమనించకుండా దిగడంతో మునిగిపోయాడు. మధుసూదన్ మునిగి పోవడాన్ని గమనించిన అతని సోదరుడు పట్టి శివమనోజ్ ఆయనను కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ అతను కూడా గుంతలో మునిగిపోయాడు. అలా ఒకరిని కాపాడపోయి ఒకరుగా మొత్తం ఆరుగురు గల్లంతయ్యారు. కాగా మధుసూదన్, మనోజ్ల తండ్రి పట్టి వెంకటస్వామి ఆటలోనే వారంతా అక్కడికి వెళ్లారు. ఆయన ఆటోను నది ఒడ్డున పెట్టి వచ్చేలోపే ఇద్దరూ కుమారులు కళ్లముందే నదిలో గల్లంతవడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయాడు.గల్లంతయిన వారిలో నలుగురు అంబట్ పల్లికి చెందినవారు కాగా మరో ఇద్దరు కొర్లకుంట గ్రామానికి చెందిన వారున్నారు. గల్లంతయిన వారిలో రక్షిత్, సాగర్, మధుసూదన్, రాంచరణ్, శివమనోజ్, రాహుల్ ఉన్నారు. అందరూ కూడా 20 ఏండ్ల లోపు వారే కావడం విషాదకరం.
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >