| Daily భారత్
Logo




ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

News

Posted on 2026-08-09 08:09:49

Share: Share


ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

డైలీ భారత్, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర కలకలం రేపే ఘటన వెలుగుచూసింది. నగరంలోని బగలగుంటె ప్రాంతంలో ఓ డ్యూప్లెక్స్ ఇంట్లో 52 ఏళ్ల మహిళ అస్థిపంజరం లభ్యమైంది. మృతురాలు దక్షాయణిగా పోలీసులు గుర్తించారు. ఆమె సుమారు ఏడాది క్రితమే మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా నివసించిన ఆమె మృతదేహం ఇంతకాలం బయటపడకపోవడం స్థానికంగా సంచలనంగా మారింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.పోలీసుల వివరాల ప్రకారం.. దక్షాయణి హవనూర్ లేఅవుట్‌లోని తన డ్యూప్లెక్స్ ఇంట్లో ఒంటరిగా ఉండేది. సుమారు పదేళ్ల క్రితం ఆమె భర్త ఉమేష్ మరణించారు. ఆ తర్వాత ఆమె కుమారుడు కూడా క్యాన్సర్‌తో మృతి చెందాడు. భర్త, కుమారుడి వరుస మరణాలతో దక్షాయణి తీవ్రంగా కుంగిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. దక్షాయణికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే కుటుంబంలో ఏర్పడిన కొన్ని అభిప్రాయ భేదాల కారణంగా ఆమె, ఆమె భర్త తరచూ దక్షాయణి ఇంటికి వచ్చేవారు కాదని తెలుస్తోంది. అంతేకాకుండా దక్షాయణి తన మొబైల్ నంబర్‌ను కూడా మార్చుకున్నట్లు కుమార్తె పోలీసులకు తెలిపింది. దీంతో ఆమెతో కుటుంబ సభ్యుల సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ ఘటనలో కుటుంబ నేపథ్యం, దక్షాయణి చివరిసారిగా ఎప్పుడు కనిపించారు, ఆమె మరణం ఎలా జరిగింది అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.దక్షాయణి సుమారు ఏడాది క్రితమే మరణించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇంట్లో లభించిన అస్థిపంజరాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఆమె మరణం సహజంగానే జరిగిందా? అనారోగ్యంతో మృతి చెందిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే అంశాలను నిర్ధారించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి కీలకమైన ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించారు. అస్థిపంజరానికి సంబంధించిన వైద్య, ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం మరణానికి గల కారణం, మరణించిన సమయం వంటి అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >