| Daily భారత్
Logo




మహిళ ఎస్సైతో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు: పోలీస్ కమిషనర్

News

Posted on 2025-06-07 15:22:23

Share: Share


మహిళ ఎస్సైతో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు: పోలీస్ కమిషనర్

డైలీ భారత్, ఖమ్మం: విధినిరవహణలో ఉన్న కల్లూరు పోలీస్ స్టేషన్ మహిళ ఎస్సై హరిత తో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.

తల్లాడ గ్రామానికి చెందిన రాయల రామారావు తో పాటు కొంతమంది  యువకులు శుక్రవారం సాయంత్రం మద్యం మత్తులో కల్లూరు పట్టణం యన్.యస్.పి క్రాస్ రోడ్డులోని చౌదరి హోటల్ వద్దకు వచ్చి గొడవ చేస్తున్నారని హోటల్ యజమాని అయిన  మాగంటి బోసుబాబు కల్లూరు పోలీస్ స్టేషన్ కు వచ్చి  ఫిర్యాదు చేయగా క్రైమ్ నెంబరు  102/2025 U/s 329(4), 296(b), 79, 189 (2) r/w 190 బి యన్ యస్ కేసు నమోదు చేసి, అట్టి కేసు విచారణ నిమిత్తం ఘటన ప్రాంతానికి ఎస్సై వెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న రాయల రామారావు,తన అనుచరులతో మరల హోటల్ వద్దకు వచ్చి సాక్ష్యాలుగా ఉన్న హోటల్ సిబ్బందిని మరియు యజమానిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినట్లయితే ఇబ్బందులకు గురి చేస్తానని హోటల్ నడవనివ్వనని హోటల్ ముందు కుర్చీ వేసుకుని కూర్చుని న్యూసెన్స్ చేస్తున్నాడనే సమాచారంతో ఎస్సై తన పోలీస్ సిబ్బందితో హోటల్ వద్దకు వెళ్ళిగా ఎస్సై ఎదురుగానే రాయల రామారావు(రాము)  తో పాటు అతని అనుచరులు మద్యం మత్తులో గొడవ చేస్తున్నారని, వారిని అక్కడి నుండి పంపించి కేసు విచారణ చేయాలనే ఉద్దేశ్యంతో ఎస్సై వారిని పంపించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో రాయల రామారావు (రాము )మరియు అతని అనుచరులు డ్యూటీలో ఉన్న మహిళా అధికారి విధులకు ఆటంకపరుస్తూ దౌర్జన్యంగా దాడి చేసి బెదిరింపులకు దిగారని తెలిపారు. 

ఈ నేపథ్యంలో కల్లూరు ఎస్సై ఫిర్యాదు మేరకు Cr.no-103/2025 U1s 74, 189, 191 (2), 195, 132, 351(2) 2/2 190 BNS. See 7 (1) మరో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

మొత్తం పదిమందిపై కేసు నమోదు కాగా ప్రధాన నిందుతుడు రాయల రామారావు తో పాటు మొత్తం  ఏడుగురిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. గతంలో రాయాల రామారావు పై తల్లాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిందని తెలిపారు.

Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >
Image 1

"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"

Posted On 2026-08-10 03:31:22

Readmore >
Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >