| Daily భారత్
Logo




వేములవాడ రాజన్న ఆలయ కోడెల మృతి ఘటనపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

News

Posted on 2025-06-03 15:01:37

Share: Share


వేములవాడ రాజన్న ఆలయ కోడెల మృతి ఘటనపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

డైలీ భారత్, హైదరాబాద్: వేములవాడ రాజన్న ఆలయంలో ఇటీవల కోడెలు మృతిచెందాయి. ఈ సంఘటన తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. భక్తులు ఇచ్చిన కోడెలు మృతిచెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈ సంఘటనపై వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడారు. కోడెల రక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే కోడెలు మృతిచెందిన సంఘటనపై తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు.

ఇవాళ(మంగళవారం) సీఎల్పీ మీడియా పాయింట్‌లో ఆది శ్రీనివాస్ మాట్లాడారు. రాజన్న ఆలయంలో కోడెల మృతిపై సమీక్ష చేశామని ఆది శ్రీనివాస్ తెలిపారు. వర్షాకాలం వ్యాధుల వల్ల కోడెలు చనిపోవడం బాధాకరమని తెలిపారు. కొందరు భక్తులు పాలు కూడా మరువని కోడెలను తీసుకువస్తున్నారని చెప్పారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని విస్తరణ చేస్తున్నామని వెల్లడించారు. పాత ఆలయం, పాత మండపాలు యధావిధిగా ఉంటాయని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.

బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని ఎమ్మెల్సీ కవిత లేఖలో పేర్కొందని ఆది శ్రీనివాస్ తెలిపారు. పొత్తు పెట్టుకోకుండా ఉండటానికి బీఆర్ఎస్ ఉండాలి కదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కేడర్‌ను మభ్య పెట్టేందుకే మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కలిసి కాంగ్రెస్‌ని దొంగదెబ్బ తీయాలని చూస్తున్నారని ఆరోపించారు. కవిత చెప్పిన దెయ్యాలు ఎవరో హరీష్‌రావు సమాధానం చెప్పాలని అన్నారు. పార్టీ ఇంటర్నల్ విషయాలు బయటకి చెప్పిన కవితపై చర్యలు తీసుకుంటారా అని నిలదీశారు. మాజీ సీఎం కేసీఆర్‌కి అధికారం లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కూడా చేయరా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నల వర్షం కురిపించారు.. KP

Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >
Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >