Posted on 2025-05-29 05:59:55
డైలీ భారత్, గుజరాత్: గుజరాత్లో ఓ ప్రేమ జంట పారిపోయేందుకు మామూలు స్కెచ్ వేయలేదు. గీతా అహిర్(22)కు భరత్ (21)తో వివాహేతర సంబంధం ఉంది. దూరంగా వెళ్లి బతకాలని వారు అనుకున్నారు. ఈ క్రమంలో హర్జీభాయ్ సోలంకీ(56)ని చంపి, మృతదేహానికి గీత దుస్తులు, పట్టీలు తొడిగి తగలబెట్టారు.
గుజరాత్లో ఓ ప్రేమ జంట పారిపోయేందుకు ఓ వృద్ధుడిని హత్య చేసి చివరికి పోలీసులకు దొరికిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జఖోట్రాకు చెందిన వివాహిత గీతా అహిర్(22)కు భరత్ (21)తో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. దీంతో వీరిద్దరూ దూరంగా వెళ్లి బతకాలని అనుకున్నారు. లేచిపోతే కచ్చింతగా దొరికిపోతామని గీత స్కెచ్ వేసింది. తెలుగుతో పాటుగా ఇతర బాషల్లో బాగా పాపులర్ అయిన దృశ్యం సినిమాను ప్రేరణగా తీసుకుని తాను చనిపోయినట్టుగా ఓ సీన్ క్రియేట్ చేసి ప్రియుడితో కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంది. ప్లాన్ ప్రకారం రోడ్డుపై వెళ్తున్న ఓ వృద్ధుడికి భరత్ లిప్ట్ ఇచ్చాడు. నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లాక అతన్ని కత్తితో పొడిచి చంపేశాడు.
ఓ రాత్రి అతన్ని శవాన్ని చెరువు వద్దకు తీసుకువెళ్లారు. అదే రోజు రాత్రి ఇంట్లో నుంచి పెట్రోల్ తీసుకుని బయటకు వచ్చిన గీత వృద్ధుడి మృతదేహానికి గీత దుస్తులు, పట్టీలు తొడిగి పెట్రోల్ తో తగలబెట్టారు. మర్నాడు ఉదయం సగం కాలిన శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తన భార్య కనిపించడం లేదంటూ గీత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చెరువు దగ్గర కనిపించిన ఓ శవానికి గీత దుస్తులు, పట్టీలు కనిపించడంతో అది చూసి గీత భర్త ఇది తన భార్య శవమేనని భావించారు. కానీ పోలీసుల విచారణలో అది పురుషుడి డెడ్ బాడీ అని తేలింది. రాజస్థాన్‌కు పారిపోయే ముందు పాలన్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఈ ప్రేమ జంట పట్టుబడింది. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >