Posted on 2025-04-29 22:42:34
డైలీ భారత్, వరంగల్:దొంగతనాలను కట్టడి చేసేందుకు చోరీ కేసుల్లో శిక్ష అనుభవించి జైలునుండి బయటకు వచ్చే దొంగలపై నిఘా పెట్టాలని కమిషనర్ అధికారులకు పిలుపునిచ్చారు. మార్చ్ నెల సంబంధించి నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ కమిషనరేట్ కార్యాలయములో నిర్వహించారు. వరంగల్ కమిషనరేట్ చెందిన పోలీస్ అధికారులు పాల్గోన్న ఈ సమీక్షా సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా సుధీర్ఘ కాలంగా పెండింగ్‌లో వున్న కేసులను సమీక్ష జరిపడంతో పాటు పెండింగ్‌కు గల కారణాలను పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకొని, కేసుల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలను పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్ పిలిపించడం కాకుండా, అధికారులు రౌడీ షీటర్లను వ్యక్తిగతం కలుసుకోవడం లేదా పరిసరాల్లో వుందే వారి నుండి రౌడీ షీటర్ ప్రస్తుత స్థితిగతులను ఆరా తీయాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలని, ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో సిసి కెమెరాలు కీలకంగా నిలుస్తున్నాని, ఇందుకు గాను పోలీస్ స్టేషన్ పరిధిలో కెమెరా పనితీరుపై అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని కొత్త సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని, పోలీస్ స్టేషన్ ల్లో పని చేసే మహిళా సిబ్బందితో అన్ని రకాల విధుల్లో రాణించే విధంగా వారిని ప్రోత్సహించడంతోపాటు మహిళా సిబ్బందిలో స్టేషన్ అధికారులు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని జాతీయస్థాయిలో గుర్తింపు, అవార్డులు తీసుకొచ్చే విధంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ ఉండాలని, రేయి పగలు ప్రజల కోసం పనిచేయాల్సి ఉంటుందని పోలీస్ శాఖకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే పోలీసు అధికారులకు రివార్డులు అవార్డులు ఉంటాయని పోలీస్ కమిషనర్ అధికారులకు తెలిపారు.
ఈ సమావేశంలో డీసీపీలు రాజమహేంద్రనాయక్, అంకిత్‌కుమార్, జనార్దన్, జనగాం ఏఎస్పీ చైతన్య, ఏ.ఎస్పీ మనాన్‌భట్, అదనపు డిసిపిలు రవి, సురేష్‌కుమార్‌తో పాటు ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గోన్నారు.
#warangal
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >