| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు!

తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు!

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్య దర్శిగా కె.రామకృష్ణారావు ను నియమించింది  ప్రభుత్వం.  తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.  1989 బ్యాచ్ కు చెందిన ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి.. 2021 జనవరి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తు న్నారు.

శాంతి కుమారి పదవి కాలం ఈనెల 30న  ముగియ నుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీఎస్ గా రామకృష్ణారావు పేరును ఖరారు చేశారు.

1990 బ్యాచ్ కు చెందిన రామకృష్ణారావు తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా రు. వచ్చే ఆగస్టులో ఆయన రిటైర్ కానున్నారు. ప్రస్తుతమున్న ఐఏఎస్‌ల్లో శశాంక్ గోయల్  తరువాత రామకృష్ణారావు సీనియర్‌ గా ఉన్నారు.

ఆర్థిక శాఖలో ఆయన చేసిన సేవలు, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో తనకున్న అనుభవం తోడ్పడుతుం దన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయనను నియమించారు.

రామకృష్ణారావు గతంలో నల్గొండ జాయింట్ కలెక్టర్‌,  గుంటూరు కలెక్టర్‌ గా  కూడా విధులు నిర్వహిం చారు. రామకృష్ణారావు మే 1 నుండి తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించనున్నారు.

Previous ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది : మోదీ
Next రామప్ప దేవాలయాన్ని సందర్శించిన మిస్ ఇండియా నందిని గుప్తా
ADVERTISEMENT