డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలం ,రావికంపాడు గ్రామంలో బిఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గానుగపాడు సహకార సంఘం ఉపాధ్యక్షురాలు భూపతి ధనలక్ష్మి కేక్ ను కట్ చేసి మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భూపతి ధనలక్ష్మి మాట్లాడుతూ..... కార్యకర్తలకు అండగా ఉండే మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. పార్టీకి కార్యకర్తలకు అండగా ఉండే నామాలాంటి నాయకుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదర్శప్రాయుడన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు , జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ మండల నాయకులు మందా అనిల్, గౌడ సంఘం మండల నాయకులు కెక్కెర్ల వెంకటేశ్వర్లు, ఎస్టీ సెల్ నాయకులు ధరావతులాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News
పేదల పాలిట పెన్నిధి మాజీ ఎంపీనామ నాగేశ్వరరావు భూపతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రావికంపాడు గ్రామంలో కేక్ కటింగ్