| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అశ్వాపురం మండలంలో రెచ్చిపోతున్న దొంగలు

అశ్వాపురం మండలంలో రెచ్చిపోతున్న దొంగలు

ఊరు బయట నివాసాలు వ్యాపార సంస్థలే వారి టార్గెట్ 

వరుస దొంగతనాలతో చెలరేగిపోతున్న  ముఠా 

 భయాందోళనలో మండల ప్రజలు సితార రెస్టారెంట్లో అర్ధరాత్రి దోపిడీ 

లక్షన్నర సొత్తు స్వహ 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:  అశ్వాపురం: మండలంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనలకు  గురవుతున్నారు. నిన్న మొన్నటి వరకు కాపర్ ట్రాన్స్ఫార్మర్, బోరు మోటర్ల దొంగతనాలు. మరువక ముందే, దొంగల ముఠా సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఆరబయట నివాస గృహాలు, వ్యాపార సంస్థలను లక్ష్యంగా ఎంచుకొని తమ మార్గానికి పదును పెడుతున్నరు. కాగా శుక్రవారం అర్ధరాత్రి ప్రధాన రహదారిపై సితార రెస్టారెంట్ నందు వెనుక వైపు తాళం పగలగొట్టి దొంగలు రెస్టారెంట్ లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేసి హల్చల్ చేశారు.

షాపులోని వివిధ వస్తువులను క్రిందపడివేసి షాపులో కౌంటర్లోని నగదును అపహరించుకొని పోయారు. మరోవైపు షాపులోని వంట కోసం వాడే సామగ్రిని, మసాలాలను, నూనె డబ్బాలను, బాస్మతి బియ్యమును దొంగలు దోసుకున్నారు. ఉదయం రెస్టారెంట్ రాగానే రెస్టారెంట్లో ఫర్నిచర్ ను చూసి యజమానులు కంగు తిన్నారు. రెస్టారెంట్లో చోరీ జరిగిందని గ్రహించిన యజమానులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే స్పందించి, రెస్టారెంట్ నువ్వు సందర్శించి, ఘటన వివరాలను యజమానులు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 ఈ సందర్భంగా యజమానులు మాట్లాడుతూ.. ప్రధాన రహదారిపై నిత్యం రద్దీగా ఉండే రెస్టారెంట్ లోని దొంగలు ఫర్నిచర్ ను, సొత్తును అపహరించారని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు.

Previous పేదల పాలిట పెన్నిధి మాజీ ఎంపీనామ నాగేశ్వరరావు భూపతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రావికంపాడు గ్రామంలో కేక్ కటింగ్
Next అంబర్‌పేట్ శంకర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జెఎన్టిహెచ్ జేఏసీ చైర్మన్ మందా రంజిత్ కుమార్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య
ADVERTISEMENT