డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్ మానవ హక్కులు మరియు అవినీతి నిరోధక సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ మత్స్యరాజు ఆదేశాల మేరకు లక్ష్మీదేవిపల్లి మండలం దారా ఫంక్షన్ హాల్ నందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ బాడీ సమావేశం మరియు అవగాహన సదస్సు ఘనంగా జరిగింది.
నేషనల్ చైర్మన్ మహిళా వింగ్ రెంటపల్లి మాధవి లత అధ్యక్షతన, నేషనల్ డైరెక్టర్ రావులపల్లి తిరుపతయ్య ఆధ్వర్యంలో ఈ సెమినార్ నిర్వహించారు.
సమావేశంలో చర్చించిన అంశాలు:
ఈ సెమినార్లో భవిష్యత్తు ప్రణాళిక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి క్వార్టర్స్ నందు ఆఫీసు ఏర్పాటు చేసే విషయంపై చర్చించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ బలమైన నిర్మాణం ఏర్పాటు అయినందున ఇంకా బలోపేతం చేయాలని, భద్రాద్రి జిల్లా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో నిర్మాణపరంగా ఆదర్శంగా ఉండాలని నిర్ణయించారు.
హైదరాబాదులో ఉన్న పరిశ్రమల తరహాలో అన్ని పరిశ్రమలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఉన్నాయని, ఆ పరిశ్రమల నుండి వచ్చే సీఎస్ఆర్ (CSR) నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, వాటిని తమ సంస్థ ద్వారా ప్రజల మేలు కోసం వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించారు.
హాజరైన నాయకులు:
ఈ కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, నేషనల్ కార్యవర్గం, తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గం సభ్యులు గంపల కృష్ణకుమారి, రెంటపల్లి మాధవి లత, సీతా కుమారి, వజ్రాల జయలక్ష్మి, దాస్యం మహేష్ రావు, జూలూరుపాడు చైర్మన్ గుమ్మడి మహేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ మాలోతు రాజేందర్, మహిళా వింగ్ చైర్మన్ లావణ్య, రమాదేవి, భద్ర తదితరులు పాల్గొన్నారు.
#BhadradriKothagudem #TRHumanRights #KoncheLavanya #Lakshmidevipalli #DailyBharat