| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సెల్ఫ్ ప్రమోషన్ చేస్తే డాక్టర్ లైసెన్స్ రద్దు... NMC సంచలన నిర్ణయం

సెల్ఫ్ ప్రమోషన్ చేస్తే డాక్టర్ లైసెన్స్ రద్దు... NMC సంచలన నిర్ణయం

డైలీ భారత్, న్యూఢిల్లీ: వైద్య రంగంలో తప్పుడు ప్రచారాలకు చెక్ పెడుతూ నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) సంచలన నిర్ణయం తీసుకుంది. డాక్టర్లు, ఆస్పత్రులు చేసే సెల్ఫ్ ప్రమోషన్లు, AI ప్రకటనలు, ఫేక్ రివ్యూలపై తక్షణ నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే 3 ఏళ్ల వరకు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది.

ఇక ఈ పదాలు వాడితే నేరమే:

"నెంబర్-1 డాక్టర్", "బెస్ట్ స్పెషలిస్ట్", "100% గ్యారెంటీ క్యూర్", "నొప్పి లేని ఆపరేషన్" వంటి అతిశయోక్తి పదాలు వాడకూడదు. చికిత్సకు ముందు-తర్వాత ఫోటోలు, సర్జరీ వీడియోలతో ప్రచారం చేయడం నిషేధం.

AI, ఫేక్ రివ్యూలపై ఉక్కుపాదం:

AIతో సృష్టించిన నకిలీ రోగుల రివ్యూలు, సింథటిక్ వాయిస్ టెస్టిమోనియల్స్, గూగుల్ ర్యాంకింగ్ కోసం ఫేక్ ఫాలోవర్లు కొనడం, ఇన్‌ఫ్లుయెన్సర్లతో పెయిడ్ ప్రమోషన్లు పూర్తిగా నిషేధం. డిస్కౌంట్లు, కూపన్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇవ్వకూడదు.

శిక్షలు ఇలా:

- 1వ సారి: హెచ్చరిక + ఎథిక్స్ ట్రైనింగ్

- 2వ సారి: భారీ జరిమానా

- 3వ సారి: 3-6 నెలలు లైసెన్స్ సస్పెండ్

- తీవ్ర ఉల్లంఘన: 6-12 నెలలు సస్పెండ్

- పదే పదే చేస్తే: రిజిస్టర్ నుండి తొలగింపు + 1 నుండి 3 ఏళ్ల వరకు లైసెన్స్ రద్దు

ఏం చేయవచ్చు:

డాక్టర్లు ప్రజా ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే పోస్టులు పెట్టవచ్చు, అందులో సొంత క్లినిక్ ప్రమోషన్ ఉండకూడదు. ఆస్పత్రులు వెబ్‌సైట్లలో డాక్టర్ల అర్హతలు, రిజిస్ట్రేషన్ నంబర్, ఫీజులు వంటి నిజమైన సమాచారం మాత్రమే పెట్టాలి.

కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చాయని NMC స్పష్టం చేసింది.

Previous అన్ని కులాల్లోని పేదలకూ రిజర్వేషన్లు దక్కాలి : ఈ నెల 24న కామారెడ్డిలో భారీ బహిరంగ సభ : కరుణాకర్ రెడ్డి
ADVERTISEMENT