డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని బీఆర్ఎస్ మాజీ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
బీఆర్ఎస్ నాయకులు వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పోలదాసు కృష్ణమూర్తి , కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేసి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు చావా వెంకటరామారావు సొసైటీ డైరెక్టర్ చాపలమడుగు రామ్మూర్తి, మండల నాయకులు తాళ్లూరి రామారావు, బానోత్ శంకర్ బానోత్ చందర్, సుమన్, బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు, కార్యకర్తలు అభిమానులు మరియు తదితరులు నాయకులు పాల్గొన్నారు