భద్రాచలం నియోజకవర్గ పీసీసీ మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్
అధ్యక్షులు గా ఇరప శ్రీను
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల నూతనంగా ఎన్నికైన నూగురు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల సంక్షేమానికి కృషి చేయాలని పీసీసీ మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. శనివారం చర్ల మండల వ్యవసాయ మార్కెట్ కార్యాలయం నూతనంగా ఎన్నికయిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు లకి, అధ్యక్షులు ఇరప శ్రీను కి బాధ్యతల కార్యక్రమం లో శాలువాతో సత్కరించారు.అనంతరం దుర్గాప్రసాద్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గానికి శాలువాల తో సత్కరించి,శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పీసీసీ మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్ మాట్లాడుతు,నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ,ఆ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానాన్ని కల్పిస్తుందన్నారు.నూతనంగా ఎన్నికైన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల అభివృద్ధికి పాటు పడాలని అన్నారు.రైతు లేనిది దేశం లేదని,రైతులే ఈ దేశానికి వెన్నుఏముక లని అన్నారు.ఈ కార్యక్రమంలో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నరు.