డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈ రోజు స్థానిక సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల,సిరిసిల్ల యందు NSS ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది.స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ G.వనజ కుమారి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిధులుగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి Y.శ్రీనివాస్ మరియు సిరిసిల్ల మున్సిపల్ కమీషనర్ కుమారి దుబ్బాక లావణ్య హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా సావిత్రి బాయి పూలే చిత్ర పటానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది.ముఖ్య అతిధులు మాట్లాడుతూ బాలికల విద్యను ప్రోత్స హించాలని,ఒక స్త్రీ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబం మొత్తం బాగు పడుతుందని తద్వారా దేశం అన్ని రంగాలలో ముందు స్థానంలో ఉంటుందని తెలిపారు.కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థినులు చాలా శ్రద్ధతో,చక్కగా చదువుకోని మంచి ఫలితాలు సాధించాలని,చిన్న వయసులోనే కష్టపడి చదువుకొని ఉన్నతమైన మున్సిపల్ కమిషనర్ స్థాయి లో ఉన్న ఈ నాటి ముఖ్య అతిథి మున్సిపల్ కమీషనర్ కుమారి దుబ్బాక లావణ్య ని ఆదర్శంగా తీసుకోవాలని తెలియచేసారు.ఈ రోజు సావిత్రి బాయి పూలే జన్మదినం సందర్భంగా కళాశాల లో చదువుతున్న విద్యార్థినులకు స్టడీ అవర్స్ లో భాగంగా రెండు నెలల పాటు ఉచిత అల్పాహారం అందించే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.DIEO శ్రీనివాస్ మాట్లాడుతూ తమ స్వంత డబ్బులతో విద్యార్థినులకు అల్పాహారం అందిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్,అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందాన్ని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్,ఆఫీస్ సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.
News
సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు