| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సావిత్రిబాయి పూలే జయంతి రోజున మహిళా టీచర్స్ డే గా ప్రకటించటం సంతోషం : మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి

సావిత్రిబాయి పూలే జయంతి రోజున మహిళా టీచర్స్ డే గా ప్రకటించటం సంతోషం : మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:ప్రతి సంవత్సరం జనవరి 3వ తారీకున సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని 3/01/2015 న ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను చూసి మహిళలకు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన గౌరవానికి చైర్ పర్సన్ సంతోషం తెలియజేశారు.

సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళ ఉపాధ్యాయ దినోత్సవం గా జరపాలని ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఒక మహిళా గా నేను అభినందిస్తున్నాను. 

మహిళలను ఇంట్లో పనిచేసే పనిమనిషిగా చూస్తున్న ఆనాటి సమాజంలో మహిళలకు విద్య కావాలని ఆమె చేసిన పోరాటం, కృషి  మహిళా దేవతగా ఈరోజు మనం ఆమెను గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది.

సుమారు 1850 లోనే తన భర్త జ్యోతిరావు పూలే పడుతున్న తపనను అర్ధం చేసుకొని తాను కూడా ఒక ఉపాధ్యాయురాలుగా మారి గడపగడపకు ఇంటింటికి తిరిగి మహిళలకు విద్య కావాలని వారికి విద్యను నేర్పించి మహిళల్లో చైతన్యం తీసుకుని వచ్చినటువంటి మహా చైతన్య నారి సావిత్రిబాయి పూలే. 

అలాగే 1852లో మహిళా మండలి స్థాపించి కుల వివక్షతను పోగొట్టేందుకు కృషి చేసింది. 1883 లో ఒక శరణాలయాన్ని స్థాపించినది, బాల వితంతువులందరికీ ఒక ఆశ్రయం కల్పించి వారికి విద్య నేర్చి వారికి జీవనోపాధి కల్పించింది. 1856 జూలై 26వ ప్రభుత్వం స్పందించి వితంతు పునర్వివాహ చట్టాన్ని అనాడు అమల్లోకి తెచ్చింది. ఆ రోజుల్లో ఆమె చేసిన కృషికి అప్పటి ప్రభుత్వం ఆమెను ఉత్తమ మహిళా ఉపాధ్యాయురాలుగా గుర్తించారు. ఆనాడు ఆమె మహిళ అభ్యున్నతికి చేసిన కృషికి ఈరోజు ప్రజా ప్రభుత్వం ఆమె పుట్టిన రోజును మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకోవడం అభినందనీయమని చైర్మన్ అన్నారు.

సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి విద్యాసంస్థల్లోనూ, బయట మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాల్సిన అవసరం కూడా ఉందని అప్పుడే ఆమెకు మనం నిజమైన ఘనమైన నివాటిని ఇచ్చినట్టు ఉంటుందని  తన అభిప్రాయం తెలిపారు.

ఈ సందర్బంగా బాబుక్యాంప్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నీరజ మరియు కుంటి రమాదేవి ఇంచార్జ్ ని సన్మానించారు.

Previous సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు
Next మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి వినతి పత్రం అందజేసిన చైర్పర్సన్
ADVERTISEMENT