డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మన్మోహన్ సింగ్ మృతిపై అసెంబ్లీలో సంతాపం తీర్మాన ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…. ప్రధానిగా మన్మోహన్ తన పదవి కాలంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని చెప్పారు. ఆర్థిక సంస్కరణలతో దేశ దశదిశ మార్చారని కొనియాడారు. మన్మోహన్ సింగ్ అందించిన సేవలు మరువలేనివన్నారు. ఆర్థిక రంగంలో మన్మోహన్ దేశానికి మార్గదర్శి. ప్రపంచ దేశంలో భారత్ ను మేటి దేశంగా నిలిపిన మన్మోహన్ కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలన్నారు. మన్మోహన్ సింగ్ ఆర్టీఐ, ఉపాధి, ఆధార్ వంటి ఎన్నో సంస్కరణలు తెచ్చారని సీఎం రేవంత్ చెప్పారు. నీతి నిజాయితీ విషయంలో మన్మోహన్ సింగ్ తో పోటీ పడేవారు నేటి తరంలో ఎవరూ లేరన్నారు. మన్మోహన్ హయాంలోనే తెలంగాణ సిద్ధించిందని చెప్పారు. భూసేకరణ చట్టంతో బాధితులకు న్యాయం చేశారు. సరళీకృత విధానాలతో ప్రపంచంతో పోటీపడేలా చేశారన్నారు. పదేళ్లు అద్భుతమైన పాలన అందించారని చెప్పారు రేవంత్ ప్రపంచీకరణ,సరళీకరణతో దేశగతిని మార్చారన్నారు..
News
మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలి : సీఎం రేవంత్ రెడ్డి