| Daily భారత్
Logo




రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

News

Posted on 2026-06-17 12:56:45

Share: Share


రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం... ఎమర్జెన్సీ వార్డులో

డైలీ భారత్, విజయవాడ: రెయిన్ బో చిన్నపిల్లల ఆసుపత్రిలోని అత్యవసర వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వార్డులోని ఎలక్ట్రికల్ బోర్డులో విద్యుదాఘాతం కారణంగా దట్టమైన పొగలు అలముకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో పలువురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. అకస్మాత్తుగా పొగలు, మంటలు వ్యాపించడంతో రోగులు ఆందోళన చెందారు.

ఆసుపత్రి ప్రాంగణంలో కేకలు, ఆర్తనాదాలతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతను గమనించిన ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఎమర్జెన్సీ వార్డులోని చిన్నారులను, ఇతర రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. 

సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >