| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సమాజానికి మహాలక్ష్మి లాంటివారు మహిళలు : మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్

సమాజానికి మహాలక్ష్మి లాంటివారు మహిళలు : మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్

షాద్ నగర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహిళలు ఈ సమాజానికే మహాలక్ష్మి వంటి వారని వారితోనే ఈ సమాజం బాగుపడుతుందని షాద్ నగర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్

తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇచ్చిన 6 గ్యారంటీల హామీలలో భాగంగా కొందుర్గ్ మండలం శ్రీరంగాపూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాలక్ష్మి పథకం అమలు చేయడం జరిగింది. ఈ పథకం కోసం అర్హులైన మహిళలందరికీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కేట్ కమిటి వైస్ చైర్మన్ సయ్యద్ సాధిక్, మహేందరెడ్డీ సమక్షంలో మహిళలకు ప్రోసిడింగులు అందజేశారు. 

ఈ సందర్భంగా సయ్యద్ సాదిక్ మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక స్వాలంబన జరిగిన నాడే కుటుంబం తద్వారా గ్రామం ఆ తర్వాత దేశం బాగుపడుతుందని అన్నారు. మహిళలు ఆర్థిక పరిపుష్టి సంపాదించడానికి ప్రభుత్వం తన వంతు సహకారం అందిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమానికి రవీందర్ యాదవ్ అశోక్ గోపాల్ జంగయ్య బల్ రాజు సురేష్ రవి వెంకటేష్ నర్సింలు రుక్మదిన్ అక్బర్ ఇస్మాయిల్ మహిళా కార్య కర్తలు అంగన్వాడీ కార్యకర్తలు గ్రామ పంచాయతీ సెక్రటరీ గ్రామ పెద్దలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది గ్రామ ప్రజలు రేవంత్ రెడ్డికి స్థానిక ఎంఎల్ఎ శంకరన్న కు కృతజ్ఞతలు తెలియ చేశారు..

Previous ప్రభుత్వ విప్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా దివ్యంగా సమితి సభ్యులు
Next రాముడి రథానికి నిప్పు
ADVERTISEMENT