| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రభుత్వ విప్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా దివ్యంగా సమితి సభ్యులు

ప్రభుత్వ విప్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా దివ్యంగా సమితి సభ్యులు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ను జిల్లా దివ్యాంగ సమితి సభ్యులు మంగళవారం వారి సమస్యలపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రభుత్వం ద్వారా ఉపాధి కల్పనలో భాగంగా జిల్లా దివ్యాంగులకు ఔట్సోర్సింగ్ లేదా కాంట్రాక్టు బేసిక్ మీద ఉద్యోగ ఉపాధి కల్పించాలని విన్నవించారు. దివ్యాంగులకు పెట్రోల్ బంక్ కేటాయించాలని, వృద్ధాశ్రమం లాగా వికలాంగులకు ఒక హాస్టల్ ఏర్పాటు చేయాలని విన్నవించారు.. వినతిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సానుకూలంగా స్పందించడంతో జిల్లా దివ్యాంగ సమితి సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాదాసు రాజేష్, ఉపాధ్యక్షులు యెల్ల హరిప్రసాద్, చిట్టీఆర్ మన్మోహన్ ప్రధాన కార్యదర్శి మంగళారపు  రాజేందర్,వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడాల నరేష్ గౌరవ అధ్యక్షులు గోగికారి రాము ముఖ్య సలహాదారులు కాసారపు పరుశరాములు ఎనగందుల రాజు సంకినేని బాలచందర్ పెరుమళ్ళ సాయికుమార్  తదితరులు పాల్గొన్నారు..

Previous ఎంఎంటిఎస్ రైలును శంషాబాద్ నుండి షాద్ నగర్ వరకు పొడిగించండి
Next సమాజానికి మహాలక్ష్మి లాంటివారు మహిళలు : మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్
ADVERTISEMENT