Posted on 2023-11-05 09:07:49
డైలీ భారత్: నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించవద్దని ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani terrorist) బెదిరించాడు. లేని పక్షంలో మీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఒక వీడియోలో హెచ్చరించాడు.న్యూఢిల్లీ/ఒట్టావా: నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించవద్దని ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani terrorist) బెదిరించాడు. లేని పక్షంలో మీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరించాడు. కెనడాలో ఉంటున్న ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ విడుదల చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని సిక్కు ప్రజలను కోరుతున్నాం. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ఇండియాను దిగ్బంధిస్తాం. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దు. లేదంటే మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది అని పేర్కొన్నాడు.
కాగా, నవంబర్ 19న ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం మూసివేస్తారని పన్నూన్ తెలిపాడు. భవిష్యత్తులో ఆ విమానాశ్రయం పేరు కూడా మారుతుందని అన్నాడు. అలాగే నవంబర్ 19న జరుగనున్న ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రస్తావిస్తూ ఈ నవంబర్ 19, ప్రపంచ టెర్రర్ కప్ ఫైనల్‌తో సమానంగా ఉంటుంది అని ఆ వీడియోలో బెదిరించాడు.
https://twitter.com/OnTheNewsBeat/status/1720711657075486858?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1720711657075486858%7Ctwgr%5Ec7c4602087157eac4681266c5729a791daf66f2b%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >