| Daily భారత్
Logo




ఎక్కడికి ఆంటీ అన్నాడు.. బుక్కయ్యాడు.

News

Posted on 2023-11-05 00:27:58

Share: Share


ఎక్కడికి ఆంటీ అన్నాడు.. బుక్కయ్యాడు.

ఎక్కడికి ఆంటీ అన్నాడు.. బుక్కయ్యాడు.. కండక్టర్‌పై కేసు నమోదు.

డైలీ భారత్ న్యూస్: ఎవరైనా సరే.. ఇతరుల్ని పలకరించేటప్పుడు అండీ అనే పదాన్ని చివర చేరుస్తారు. తద్వారా వారిని గౌరవిస్తూ సంభాషించినట్లు అవుతుంది. ఈ కేసులో కండక్టర్..ప్రయాణికులతో సంభాషించాలంటే.. ఎక్కడికి వెళ్లాలండీ అని లేదా.. ఎక్కడికి టికెట్ కావాలి అని అడగొచ్చు.. లేదా ఎక్కడికి ఇవ్వాలి? అని అడగొచ్చు.. కానీ ఆ కండక్టర్.. ఆంటీ అని పిలవడం సమస్య అయ్యింది.

తమిళనాడు.. చెన్నైలో ఇది జరిగింది. వాషర్‌మెన్‌పేటకు చెందిన 57 ఏళ్ల నిర్మలాదేవి.. బుధవారం చెన్నై మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (MTC) బస్సులో మింట్ నుంచి రెడ్‌హిల్స్‌కి ప్రయాణించారు. ఆ బస్సులో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కార్తీక్... ఎక్కడికి వెళ్తున్నారు ఆంటీ అని అడిగారు. అంతే.. అల్లకల్లోలం అయిపోయింది.

నన్ను ఆంటీ అంటారేంటి? అని ఆమె ప్రశ్నించింది. అప్పుడైనా కార్తీక్.. తన తీరు మార్చుకుంటే బాగుండేదే.. కానీ అతను మళ్లీ అలాగే ఆంటీ అని సంబోధించాడు. దాంతో ఆమెకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. తన భర్తకు కాల్ చేసింది. ఏం కాదులే అని కార్తీక్ అనుకున్నారు. ఐతే.. ఆమె బస్సు దిగుతూ.. అక్కడున్న భర్తతో కలిసి.. రెడ్ హిల్స్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది.

తనను ఆంటీ అని పిలిచి అవమానించారని.. కండక్టర్‌పై ఆమె కంప్లైంట్ ఇచ్చింది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కేసు రాసిన పోలీసులు.. విచారిస్తామని చెప్పారు. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని పెద్దలు చెబుతుంటారు.

Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >