| Daily భారత్
Logo




అధికారంలోకి రాగానే విలీన గ్రామాలను గ్రామపంచాయతీలు చేస్తాం : సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ

News

Posted on 2023-11-04 17:29:27

Share: Share


అధికారంలోకి రాగానే విలీన గ్రామాలను గ్రామపంచాయతీలు చేస్తాం : సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ

సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ

డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపల్ లో  విలీనమైన గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే విలీన గ్రామాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ హామీ ఇచ్చారు. శనివారం పట్టణంలోని ఒకటో వార్డు రగుడు లో ప్రజా ఆశీర్వాద పాదయాత్ర స్థానిక బిజెపి నాయకులతో కలిసి ఆవిడ ప్రారంభించారు. ఈ సందర్భంగా రగుడు, చెంద్రంపెట, శ్రీనగర్ కాలనీ, శాంతినగర్, అంబేద్కర్ నగర్, రెడ్డివాడ, రాళ్ళబావి, పెద్దబజార్, లాల మల్లేశం బజార్ కాలనీలలో పాదయాత్ర చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాణి రుద్రమ మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా, 10 ఏళ్ళుగా అధికారంలో ఉండి, సిరిసిల్ల ప్రజలకు ఏమాత్రం న్యాయం చేయకుండా నిర్బంధాలకు, అక్రమాలకు, అరెస్టులకు తెరలేపిన కేటీఆర్ ను గద్దె దింపడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆశీర్వాదంతో బిజెపి అభ్యర్థిగా తాను సిరిసిల్లకు రావడం జరిగిందన్నారు. విలీన గ్రామాలకు న్యాయంగా దక్కవలసిన హక్కులను కేటీఆర్ కాలరాసాడని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తనను అసెంబ్లీకి పంపిస్తే కొట్లాడి విలీన గ్రామాలను మళ్ళీ గ్రామపంచాయతీలుగా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం అభివృద్ధి పదంలో కొనసాగుతుందని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే సిరిసిల్లాను దేశం గర్వించే విధంగా అభివృద్ధి చేస్తానన్నారు. విద్యా, వైద్యం ,ఉపాధికి బిజెపి పెద్దపీట వేస్తుందని, కమిషన్ల కోసం పనిచేస్తున్న బిఆర్ఎస్ నాయకులను ఓడించి, సబండ వర్గాల కోసం పనిచేస్తున్న బిజెపిని ఆదరించాలని కోరారు. మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చి మహిళలకు అత్యధిక సీట్లు కేటాయించిన పార్టీ, బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని, గతంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ లకు అవకాశాలు ఇచ్చారని ఇప్పుడు బిజెపి పార్టీ అభ్యర్థిగా ఒక ఆడబిడ్డగా వచ్చిన తనను సిరిసిల్ల ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. పాదయాత్రలో బిజెపి జిల్లా, మండల పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >