Posted on 2023-10-28 18:35:06
చంద్రగ్రహణం సందర్భంగా ముందుగా రథోత్సవం
డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల :జిల్లా కేంద్రంలో శ్రీశాల లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం పౌర్ణమి సందర్భంగా రథోత్సవం కనుల పండువలా సాగింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఆలయ పురవీధుల్లో రథోత్సవం కమనీయంగా జరిగింది. అక్టోబర్ 21 నుంచి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగాయి. తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల తరహాలోనే ఇక్కడ సైతం ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారి వాహనసేవలు జరిగాయి. ఉదయం ఆలయంలో అర్చకులు పూర్ణాహుతి, హోమం, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు రథంపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి, రాష్ట్ర పవర్ లుం, టెక్స్టైల్స్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రవాణిలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటలకు రథోత్సవం నిర్వహించవలసి ఉండగా శనివారం రాత్రి చంద్రగ్రహణం సంభవిస్తున్న నేపథ్యంలో రథోత్సవాన్ని ఆలయ అధికారులు మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించారు. స్వామివారు ఉభయదేవేరులతో కలిసి రథంపై పురవీధుల్లో విహరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >