Posted on 2024-03-19 13:47:52
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో రైటర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సురేందర్ రైటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మెదక్ మండలం అవుసుల పల్లికి చెందిన కందుల రాములు ఇసుక ట్రాక్టర్ విడుదల విషయంలో రైటర్ సురేందర్ రూ. 15 వేలు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇస్తేనే ఇసుక ట్రాక్టర్ విడుదల చేస్తామని చెప్పడంతో రూ. 15 వేలు రైటర్ సురేందర్‌తో ఒప్పందం కుదుర్చుకొని మొదటగా నాలుగు వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. డబ్బులు డిమాండ్ చేసిన కానిస్టేబుల్ పై బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుడితో మాట్లాడిన అధికారులు మంగళవారం పక్కా ప్రణాళికతో వచ్చి డబ్బులు నాలుగు వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది.. వారం రోజుల క్రితం పది వేలు ఇచ్చిన బాధితుడు మరోసారి డిమాండ్ చేయడం వల్లనే ఏసీబీనీ ఆశ్రయించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >