| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మైనారిటీ గురుకులం విద్యార్థిని కాపాడిన ఆర్టీసీ

మైనారిటీ గురుకులం విద్యార్థిని కాపాడిన ఆర్టీసీ

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: ఈరోజుల్లో మనకెందుకులే అనే స్వభావం చాలామందిలో ఉంటుంది ఒక ఆర్టీసీ బస్సు (మిధాని డిపో) కండక్టర్ (శేఖర్), డ్రైవర్ (జె.ఎస్.కుమార్) చొరవ ఒక విద్యార్థిని కాపాడింది.పటాన్ చెరువులోని తెలంగాణ మైనారిటీ గురుకులం విద్యార్థిని అనూహ్యంగా పటాన్ చెరువు వద్ద ఆర్టీసీ బస్సు (నెం.218) ఎక్కింది.చేతిలో పది రూపాయల నోటు తప్ప ఆ బాలిక వద్ద ఏమి లేవు, కాళ్లకు చెప్పులు కూడా లేవు.పక్కన ఉన్న ప్యాసింజర్ వద్ద ఫోన్ తీసుకొని ఆ అమ్మాయి మాట్లాడిన నెంబర్ ఆధారంగా ఆ అమ్మాయి మైనారిటీ గురుకులం విద్యార్థిగా నిర్ధారణ అయింది.  చివరకు బాలికను సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో భద్రంగా అప్పగించడం జరిగింది. ఇందులో చాకచక్యంగా వ్యవహరించిన మిథానీ డిపో కండక్టర్ శేఖర్ ,డ్రైవర్ కుమార్ లకు అభినందనలు తెలియచేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.

Previous రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం
Next గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చింతలపూడి యుగంధర్ మృతి
ADVERTISEMENT