| Daily భారత్
Logo




వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్లకు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చొరవ

News

Posted on 2026-07-21 12:52:04

Share: Share


వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్లకు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చొరవ

కాలనీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన కాలనీ అధ్యక్షుడు ఏ. విజయేందర్ రెడ్డి

డైలీ భారత్, ఉప్పల్: వెంకట సాయి నగర్ కాలనీలో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్లను తక్షణమే మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతూ కాలనీ అధ్యక్షుడు,  ఏ. విజయేందర్ రెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బండారు లక్ష్మారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా విజయేందర్ రెడ్డి  కాలనీలోని పలు అంతర్గత వీధులు ఇప్పటికీ మట్టి రోడ్లుగానే ఉండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాలంలో రోడ్లు పూర్తిగా బురదమయంగా మారి చిన్నారులు, వృద్ధులు, మహిళలు నిత్యావసర పనుల కోసం బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు, ఇతర సేవా వాహనాలు కాలనీలోకి సులభంగా చేరుకోలేని పరిస్థితి నెలకొన్నదని వివరించారు.

అదేవిధంగా రోడ్లు సరిగా లేకపోవడంతో  దుమ్ము, బురద కారణంగా ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. కాలనీలో నివసిస్తున్న వందలాది కుటుంబాలు సంవత్సరాలుగా సీసీ రోడ్ల కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సమస్యను సానుకూలంగా పరిశీలించి వెంటనే స్పందించారు. కాలనీలో సీసీ రోడ్ల పనులకు సంబంధించిన ప్రతిపాదనలను వేగవంతం చేయాలని కోరుతూ సంబంధిత జోనల్ కమిషనర్‌కు వాట్సాప్ ద్వారా తన సిఫారసు లేఖను పంపించారు. కాలనీ మొత్తం రోడ్లకు సమగ్ర ఎస్టిమేషన్‌ను త్వరితగతిన పూర్తి చేసి, పరిపాలనా అనుమతులు మంజూరు చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని ఎమ్మెల్యే పేర్కొంటూ, కాలనీలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి సీసీ రోడ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసేలా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు గంధం నాగేశ్వరరావు , ఎండి జాంగిర్ , కాలనీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >