| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తరగతులకు రోజూ హాజరుకావాలి.. ప్రణాళిక ప్రకారం చదవాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

తరగతులకు రోజూ హాజరుకావాలి.. ప్రణాళిక ప్రకారం చదవాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

డైలీ భారత్, వేములవాడ: విద్యార్థులు ప్రతిరోజూ తరగతులకు హాజరై ప్రణాళికాబద్ధంగా చదవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.

సోమవారం వేములవాడ పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్‌ను పరిశీలించి పరిసరాల పరిశుభ్రత, మెనూ చార్ట్ ప్రకారం భోజనం సిద్ధం చేస్తున్నారా అనే విషయాలను పరిశీలించారు. స్టోర్‌రూమ్‌లో బియ్యం, పప్పులు, గుడ్లు తదితర ఆహార పదార్థాల నాణ్యతతో పాటు సంబంధిత రిజిస్టర్లను తనిఖీ చేసి, విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా అని ఆరా తీశారు.

అనంతరం పదో తరగతి విద్యార్థులతో సమావేశమైన కలెక్టర్, ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా తరగతులకు హాజరై లక్ష్యంతో చదవాలని సూచించారు. గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను సాధన చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకమైన దశ అని పేర్కొన్నారు.

అలాగే, తీరిక సమయంలో ఆటలు ఆడాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, భోజనం చేసే ముందు మరియు తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలని విద్యార్థులకు సూచించారు.


#SircillaNews #SircillaUpdates #RajannaSircilla #Vemulawada #GarimaAgrawal #Education #ResidentialSchool #Students #Telangana #SchoolInspection

Previous శబరిమల బంగారు దోపిడీ కేసులో తుది నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలి...
Next మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
ADVERTISEMENT