రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ:స్కూల్ పిల్లల భద్రతను ప్రైవేటు పాఠశాలలు గాలికొదిలేస్తున్నాయి. వేములవాడ పరిధిలోని నందికమాన్ వైపు వెళ్తున్న ప్రైవేటు స్కూల్‌కు చెందిన టాటా ఏసీ వాహనంలో 19 మంది విద్యార్థులను ఒకేసారి ప్రమాదకరంగా తరలిస్తుండగా టీఆర్పీ నేతలు పట్టుకున్నారు.
ఈ విషయాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ మీడియాకు వెల్లడించారు. వాహన సామర్థ్యానికి మించి పిల్లలను ఎక్కించి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. వెంటనే వాహనాన్ని ఆపి DTO, ట్రాఫిక్ SIలకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
ఇటీవల అనుపురం వద్ద జరిగిన వలస కూలీల ప్రమాదం ఇంకా మరువక ముందే, స్కూల్ యాజమాన్యాలు, RTA, పోలీస్ శాఖల్లో ఎలాంటి మార్పు రాకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
ప్రధాన డిమాండ్లు:
నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల సీజ్
స్కూళ్లకు నోటీసులు, యాజమాన్యాలపై కఠిన చర్యలు
జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలి
ఈ మేరకు జిల్లా DTO, DPO, ట్రాఫిక్ అధికారులకు రాతపూర్వక ఫిర్యాదు అందజేయనున్నట్లు దండు వినోద్ పేర్కొన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
#StudentSafety #Sircilla #Vemulawada #Telangana