| Daily భారత్
Logo




ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి

News

Posted on 2026-07-18 14:11:17

Share: Share


ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి

క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షణ చేయాలి.

అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లావ్యాప్తంగా నిర్మాణ పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను వేగవంతంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయడం, రెండో దశలో ఇండ్ల మంజూరుపై గృహనిర్మాణ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, అన్ని మండలాలకు కేటాయించిన లక్ష్యం, ఇప్పటివరకు పూర్తయిన నిర్మాణాలు, వివిధ దశల్లో ప్రగతిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల వివరాలను కలెక్టర్ ఆరా తీశారు.

ఇండ్లు లేని పేదల కలలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేస్తుందని తెలిపారు. గుడిసెలు, రేకుల షెడ్లలో నివసిస్తున్న వారికి పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని ఆదేశించారు. నిర్మాణాలు వేగవంతం చేసేలా క్షేత్ర స్థాయిలో అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా నిర్మాణాల్లో జాప్యం జరిగితే వాటి కారణాలు తెలుసుకుని, సమస్యలు పరిష్కరించి, నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేసేలా చూడాలని సూచించారు. ప్రగతిలో ఉన్న ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసి గృహప్రవేశాలు చేసేందుకు ముందుకు వెళ్లాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓ లు, ఏఈ లు క్షేత్ర స్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించి, లబ్ధిదారుల ఇబ్బందులు దూరం చేయాలని  ఆదేశించారు. రోజూ వారీగా ఇండ్లను లక్ష్యం మేరకు పూర్తి చేయాలని సూచించారు. రెండో దశ నిర్మాణాల మంజూరుపై ఆరా తీసిన కలెక్టర్, నిర్మాణానికి ఆసక్తి ఉన్న అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేయాలని ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్ లో హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి జయశీల తదితరులు పాల్గొన్నారు.

Image 1

నేతన్న నెత్తుటి నూలు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-07 06:40:06

Readmore >
Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >
Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >