Posted on 2026-07-11 04:14:53
డైలీ భారత్, కాకినాడ: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిస్తామని, ప్రతి నెల స్థిరమైన లాభాలు ఇస్తామని నమ్మబలికి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఘటన కాకినాడలో వెలుగుచూసింది.
జిల్లా క్రీడా మైదానం ఎదురుగా ఉన్న కేఆర్‌కే ప్లాజాలో "ఆల్మైటీ జెనెసిస్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్" పేరుతో కార్యాలయం నిర్వహిస్తూ నిందితులు 2023 జూలై నుంచి ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బు సేకరించారు.
అందిన ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ జి. బింధు మాధవ్ ఆదేశాలతో, అదనపు ఎస్పీ ఎం. కిశోర్ కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
ఈ కేసులో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పులుగు మోజేష్, డైరెక్టర్ సంధనా లలిత అంబికలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 6 ల్యాప్‌టాప్‌లు, 4 సెల్‌ఫోన్లు, 1 కారుతో పాటు పెట్టుబడులకు సంబంధించిన బాండ్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో మొత్తం 7,342 పెట్టుబడుల ద్వారా రూ.98.66 కోట్లకు పైగా సేకరించినట్లు తేలింది. వీటిలో 3,633 పెట్టుబడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వాటి విలువ రూ.53.87 కోట్లు. ఇప్పటివరకు పెట్టుబడిదారులకు లాభాలతో కలిపి రూ.16.13 కోట్లు చెల్లించగా, ఇంకా రూ.37.74 కోట్లు చెల్లించాల్సి ఉంది.
అరెస్టు చేసిన నిందితులను కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచినట్లు అదనపు ఎస్పీ ఎం. కిశోర్ కుమార్ తెలిపారు.
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >