| Daily భారత్
Logo




ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

News

Posted on 2026-07-10 18:53:44

Share: Share


ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

డైలీ భారత్, సిరిసిల్ల:ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ పై సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

పోలీసులు, మున్సిపల్ వర్గాల సమాచారం ప్రకారం...  

సిరిసిల్ల మున్సిపాలిటీ 22వ వార్డుకు చెందిన వింగల్ సులోచన ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇల్లు శాంక్షన్ చేయాలంటే వైస్ చైర్మన్ దర్ల సందీప్ ₹1,00,000 లంచం అడిగారని ఆమె ఈ నెల 6న జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన "ప్రజావాణి" కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. లంచం డిమాండ్ చేస్తున్నట్లు ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కమిషనర్ ఫిర్యాదుతో కేసు నమోదు...

బాధితురాలి ఫిర్యాదుపై మున్సిపల్ కమిషనర్ తీవ్రంగా స్పందించారు. నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జూలై 9న సిరిసిల్ల టౌన్ పోలీసులకు అధికారిక లేఖ రాశారు. విచారణకు సహకరించేందుకు 22వ వార్డు ఆఫీసర్ శేఖర్ బాబు, హౌసింగ్ ఏఈ రాజశేఖర్‌లను నియమించారు.

కమిషనర్ లేఖ ఆధారంగా పోలీసులు గురువారం రాత్రి 7:30 గంటలకు వైస్ చైర్మన్ దార్ల సందీప్‌పై క్రైమ్ నంబర్ 401/2026 కింద, BNS సెక్షన్ 308(2) r/w 62 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను టౌన్ ఎస్ఐ సి.హెచ్. గణేష్ కు అప్పగించారు.

ప్రభుత్వ పథకం పేరుతో లంచం ఆరోపణలు రావడంతో సిరిసిల్లలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >