| Daily భారత్
Logo




దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

News

Posted on 2026-07-11 05:32:51

Share: Share


దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగిన మారణహోమం స్థానికంగా కలకలం రేపింది. POCSO కేసులో కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి బాలిక కుటుంబంతో పాటు తన సొంత భార్య, ఇద్దరు చిన్నారులను కూడా దారుణంగా హత్య చేశాడు.

పోలీసుల కథనం ప్రకారం, దైవాలగూడకు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలికను రాజ్ కుమార్ అనే వ్యక్తి వేధిస్తున్నాడు. ఈ విషయంపై బాలిక తల్లితో కలిసి మే 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాజ్ కుమార్‌పై POCSO చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

బెయిల్‌పై విడుదలైన తర్వాత రాజ్ కుమార్ కక్షతో రగిలిపోయాడు. శనివారం తెల్లవారుజామున బాలిక ఇంటికి వెళ్లి 65 ఏళ్ల రుక్కమ్మ, 45 ఏళ్ల లక్ష్మీలను హత్య చేశాడు. ఆ తర్వాత బాలికను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి కూడా హత్య చేశాడు.

ఇక్కడితో ఆగకుండా తన ఇంటికి వెళ్లి 30 ఏళ్ల భార్య పార్వతి సరిత, 3 ఏళ్ల కుమారుడు పరీక్షిత్, 2 ఏళ్ల కుమారుడు దైవిక్షిత్‌లను కూడా చంపేశాడు.

అన్ని హత్యలు చేసిన తర్వాత రాజ్ కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి "6 మందిని చంపేశాను" అని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు.

సమాచారం అందుకున్న షాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 6 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భార్యా పిల్లలను ఎందుకు చంపాడనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ ఘటనతో దైవాలగూడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >