Posted on 2026-06-14 13:20:56
డైలీ భారత్, అంతర్గాం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మురుమూరు గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన ఘటన గ్రామంలో కలకలం రేపింది. మురుమూరు గ్రామానికి చెందిన నంది రాయమల్లు, ఆయన భార్య లక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శనివారం తెల్లవారు జామున కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య లక్ష్మిపై అనుమానం పెంచుకున్న రాయమల్లు గొడ్డలితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వై. కృష్ణ కుమార్, అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బోయ వెంకటస్వామి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులను విచారించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అంతర్గాం ఎస్ఐ బోయ వెంకటస్వామి తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >