ఎస్సై రమాదేవి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 498 కేజీల ఎండు గంజాయి కలిగిన లారీ కంటైనర్ పట్టుకొని ఇద్దరు నిందితులైన జగదీష్ దయారాం పాటిల్ మరియు లారీ డ్రైవర్ సంజు కుమార్ లను సుజాతనగర్ పోలీసు పట్టుకుని రిమాండ్ పంపించడం జరిగింది. ఇట్టి కేసులో పరారీలో ఉన్న గంజాయిని ఒడిస్సా రాష్ట్రంలోని జైపూర్ చెందిన వ్యక్తి వద్ద నుండి కొని నారీ కంటైనర్ లో పెట్టి తరలించన మూడవ ముద్దాయి అయిన మహారాష్ట్ర కు చెందిన అమిత్ రోహిదాస్ పాటిల్ అను వ్యక్తిని సుజాతనగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రమాదేవి పట్టుకొని, కేసు దర్యాప్తు అధికారి చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ వెంకటేశ్వర్లు రిమాండ్ కు తరలించడం జరిగింది. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను కొనడం, అమ్మడం, కలిగి ఉండడం, తాగడం, ట్రాన్స్పోర్ట్ చేయడం చట్టరీత్యా నేరం. అట్టి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోబడును. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు