Posted on 2026-04-23 18:36:19
నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్‌వార్డ్, అవుట్‌వార్డ్ విభాగాలు, రక్తపరీక్ష కేంద్రాన్ని పరిశీలించి రోగులకు అందుతున్న సేవలపై సమగ్రంగా ఆరా తీశారు.
రక్తపరీక్షల నిర్వహణ, నమోదు విధానాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేసి సమయపాలన పాటించాలని ఆదేశించారు. మందుల నిల్వ గది (స్టాక్ రూమ్)ను పరిశీలించి స్టాక్ రిజిస్టర్‌ను తనిఖీ చేసి అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయా అనే విషయంపై అధికారులను ప్రశ్నించారు.
వేసవికాలంలో వడదెబ్బలు తగిలే ప్రమాదం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు సహా అవసరమైన మందులు సమృద్ధిగా నిల్వలో ఉంచుకోవాలని సూచించారు. ప్రతి రోగికి తక్షణ చికిత్స అందేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ఆదేశించారు. ప్రజలకు విశ్వసనీయమైన వైద్య సేవలు అందించడం ఆరోగ్య శాఖ బాధ్యత అని పేర్కొన్నారు.
#BhadradriKothagudem #Karakagudem #PublicHealth #PHC #Healthcare #Telangana
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >