| Daily భారత్
Logo




హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం

News

Posted on 2026-04-21 16:28:14

Share: Share


హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం

డైలీ భారత్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతంలో ఎప్పుడు లేని తోలిసారిగా భారీ స్థాయిలో హాష్ ఆయిల్ (గంజాయి మొక్కల నుండి తీసిన నూనె) స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాలోని నలుగురు సభ్యులను వరంగల్ డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్‌గంజ్ పోలీసులు సంయుక్తంగా కలసి అరెస్టు చేసారు. ఈ ముఠా నుండి పోలీసులు సుమారు 2 కోట్ల 50లక్షల విలువ గల హాష్ ఆయిల్‌తో రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1. హంటల్ సన్ను (23),సువ్వపల్లి గ్రామం, చిత్రకొండ మండలం, మల్కాన్‌గిరి జిల్లా, ఒడిషా రాష్ట్రం, 2.హంటల్ సన్యాసి (23), రేకపల్లి, చిత్రకొండ మండలం, మల్కాన్‌గిరి జిల్లా, ఒడిషా రాష్ట్రం, 3. కండెల చిన్నబాబు (56), దారకొండ గ్రామం, గూడెం మండలం, అల్లూరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 4.కృష్ణ హంటల్ (56),రేకపల్లి, చిత్రకొండ మండలం, మల్కాన్‌గిరి జిల్లా, ఒడిషా రాష్ట్రానికి చెందిన వారిని పోలీసులు అరెస్టు చేయగా, మరో నిందితుడు కిలో పాండు ప్రస్తుతం పరారీ వున్నాడు.

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, IPS వివరాలను తెలియజేస్తూ పట్టుబడిన నిందితులందరు పరిచయస్తులు కాగా, ఇందులో ప్రధాన నిందితుడు హంటల్ సన్ను తన స్వగ్రామంలో గంజాయి మొక్కలను పెంచుతూ వాటిని మిగితా నిందితుల ద్వారా విక్రయించి సోమ్ము చేసుకుని జల్సాలకు చేసేవారు. కాని నిందితులకు గంజాయి విక్రయాలలతో వచ్చే డబ్బు వారి జల్సాలకు సరిపోకపోవడంతో ప్రధాన నిందితుడు గంజాయి మొక్కల నుండి హాష్ ఆయిల్‌ను తయారు చేసే మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో వున్న కిలో పాండు నిందితుడితో పరిచయం కావడంతో, పాండు ఇచ్చిన సూచనల మేరకు ప్రధాన నిందితుడు మిగితా నిందితులతో కలసి గంజాయి మొక్కలను పెంపకం చేపట్టిన అనంతరం, నిందితుడు పాండు తీసుకవచ్చిన పరికరం ద్వారా ఈ ముఠా సభ్యులు గంజాయి మొక్కలను ద్వారా 40 కిలోల హాష్ ఆయిల్‌ను సేకరించారు. ఈ విధంగాంగా తయారు చేసిన హాష్ ఆయిల్‌లో 20 కిలోల హాష్ ఆయిల్‌ను పాండు తను తీసుకోగా, మిగితా 20కిలోల హాష్ ఆయిల్‌ను కిలో చోప్పున ప్యాకేట్లలో భద్రపర్చి పట్టుబడిన నిందితడులందరు ఐదు కిలోల చోప్పున హాష్ ఆయిల్‌ను  తీసుకోని ముంబాయిలో విక్రయించేందుకు ఆంద్రప్రదేశ్ తుని రైల్వే స్టేషన్ నుండి ఈ నెల 19 తేది అర్దరాత్రి కోనార్క్ రైలులో బయలు దేరారు. వరంగల్ రైల్వేలో పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా ముఠా అనుమానం రావడంతో ఈ ముఠా సభ్యులు వరంగల్ రైల్వే స్టేషన్‌లో నిన్నటి రోజు దిగిన నిందితులు ఈ రోజు ఉదయం  ముంబాయి వేళ్ళేందుకు ఈ ముఠా సభ్యులు ఈ రోజు ఉదయం వరంగల్ బస్టాండ్ వద్ద వున్న రైల్వే గూడ్స్ షెడ్ పరిసరాల్లో అనుమాస్పదంగా తిరుగున్నాట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు వెళ్ళి నిందితులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారివద్ద హాష్ అయిల్‌ను గుర్తించిన పోలీసులు నిందితులను అరెస్టు చేసిన 20 కిలోల హాష్ అయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పెద్ద ఎత్తున హాష్ ఆయిల్‌తో పాటు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత, వరంగల్ ఏఎప్పీ శుభం, ఏసిపి లు జితేందర్ రెడ్డి, జానీ నర్సింహులు, డ్రగ్ కంట్రోల్ టీం ఇన్స్‌స్పెక్టర్ వై.సతీష్, ఇంతేజార్‌గంజ్ ఇన్స్‌స్పెక్టర్ షూకూర్, ఎస్.ఐలు సందీప్, తేజ ఆర్.ఎస్.ఐలు ఏ.పూర్ణ చందర్ రెడ్డి, కె.మనోజ్ రెడ్డి, ఎల్.లింగారావు, క్యాట్ పార్టీ ఏ.ఆర్.ఏ.ఎస్.ఐలు వి.సుబ్బిరామి రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్ళు బాల రాజు, కె.శ్రీరాములు, యం.డి రబ్బానీ, ఆర్.రాజ్‌కుమార్‌తో పాటు ఇంతేజార్‌గంజ్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >
Image 1

స్తంభించిన న్యాయవ్యవస్థ...

Posted On 2026-04-24 12:06:23

Readmore >
Image 1

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం

Posted On 2026-04-24 11:24:14

Readmore >
Image 1

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతి

Posted On 2026-04-23 22:57:41

Readmore >
Image 1

అదనపు ఎస్పీ బి. చైతన్య రెడ్డి, IPS ఘన వీడ్కోలు

Posted On 2026-04-23 22:41:19

Readmore >
Image 1

శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Posted On 2026-04-23 22:39:08

Readmore >
Image 1

నిర్లక్ష్యపు నీడలో నలిగిన మానుకోట

Posted On 2026-04-23 22:03:53

Readmore >
Image 1

నూతన బోరు మోటర్ బిగింపు

Posted On 2026-04-23 18:59:41

Readmore >
Image 1

సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్

Posted On 2026-04-23 18:39:41

Readmore >