Posted on 2026-04-21 16:08:22
డైలీ భారత్, నారాయణపేట: లంచాలు ఇవ్వడం, తీసుకోవడం నేరం.. లంచాలను ప్రోత్సహించొద్దని, అవినీతికి పాల్పడుతున్న అధికారులను నియంత్రించేందుకు ఏసీబీ అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా ఎక్కడో ఒక చోట అవినీతి బయటపడుతూనే ఉంది. బాధ్యత గల ఉద్యోగాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ఆ విషయాన్ని మరిచిపోయి లంచాలు దండుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడుతున్నారు. తాజాగా ఓ ఆర్డీవో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.
నారాయణపేట ఆర్డీవో కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి నుంచి 25వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఆర్డీవో రాంచంద్ర నాయక్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. రాంచంద్రనాయక్ ఈ ఏడాది అక్టోబర్ రిటైర్‌మెంట్ కావాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకంగా లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని లేదా 9440446106 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ ఉన్నతాధికారి కోరారు.
#acb Telangana #acb #acb Narayana peta #narayanapeta
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >