| Daily భారత్
Logo




ఆర్టీసీ కార్మికుల సమ్మె – శాంతియుతంగా నిర్వహించాలి

News

Posted on 2026-04-22 22:58:48

Share: Share


ఆర్టీసీ కార్మికుల సమ్మె – శాంతియుతంగా నిర్వహించాలి

ప్రజా అశాంతికి కారణమైతే కఠిన చర్యలు తప్పవు – జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో చట్టం మరియు శాంతిభద్రతల పరిరక్షణ పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యమని జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు తెలిపారు. సమ్మె అనేది ప్రజాస్వామ్య హక్కు అయినప్పటికీ, అది పూర్తిగా శాంతియుత వాతావరణంలోనే నిర్వహించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజల రోజువారీ జీవనానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు.

జిల్లా ఎస్పీ ముఖ్య సూచనలు:

సమ్మె కారణంగా విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవలు వినియోగించే ప్రజలు ఇబ్బందులు పడకుండా రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టబడింది.

ప్రైవేట్ డ్రైవర్లు తాత్కాలికంగా విధుల్లోకి వచ్చినా లేదా ఆర్టీసీ సిబ్బంది తిరిగి డ్యూటీలో చేరినా వారికి పూర్తి స్థాయి పోలీస్ రక్షణ కల్పించబడుతుంది. అదెవిధముగ విధులకు హజరు అయ్యె వవారిని రాకుండా భయభ్రాంతులకు గురిచేసిన వారిపై 100% చట్టపరమైన కేసులు నమోదు చేయబడుతాయి

బస్సుల రాకపోకలు జరిగే ప్రాంతాలు, డిపోలు, ముఖ్య కూడళ్లు మరియు బస్టాండ్ పరిసరాల్లో అదనపు పోలీస్ బందోబస్తు, నిరంతర పొలీస్ పర్యవేక్షణ ఏర్పాటు చేయబడింది.

ఎవరైనా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించినా, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించినా, అధికారులపై దాడులకు పాల్పడినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడమె కాకుండ వారిపై శాఖ పరమైన చర్యల గురించి రిపోర్టులు పంపబడును.  

ఈరోజు కామారెడ్డి బస్టాండ్ యందు నిలిచి ఉన్న బస్సు టైరు నుండి గాలి తీసివేసి ప్రభుత్వ ఆస్తికి నష్టపరిచి ప్రజా రవాణాకు భంగం కలిగించినారు.  ఇట్టి సంఘటనలో పాల్గొన్న వారిపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం మరియు పోలీసు విధులను ఆటంకపరిచిన నేరాల కింద ఇప్పటికే కేసులు  నమోదు చేయబడినవి. శాఖ పరమైన చర్యల గురించి రిపోర్టులు పంపబడును. 

ఇకపై కూడా ఎవరైనా అశాంతియుత పద్ధతులలో నిరసనలు తెలియజేస్తే వారిపై కచ్చితంగా కేసులు నమోదు చేయబడతాయి.

కామారెడ్డి జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా శాంతియుత వాతావరణం కాపాడుట కొరకు ముమ్మర పెట్రోలింగ్, పోలీస్ పికెట్స్ మరియు పెట్రోలింగ్, CCTV నిఘా  ఏర్పాటు చేయడం జరిగింది.జిల్లా ప్రజలు, ఉద్యొగులు  పోలీస్ శాఖకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100 కి  సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ  విజ్ఞప్తి చేశారు. 


Image 1

ఆర్టీసీ కార్మికుల సమ్మె – శాంతియుతంగా నిర్వహించాలి

Posted On 2026-04-22 22:58:48

Readmore >
Image 1

ఫరీద్‌పేట్ గ్రామ పంచాయతీలో అక్రమాల ఆరోపణలు

Posted On 2026-04-22 22:55:13

Readmore >
Image 1

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ

Posted On 2026-04-22 20:13:36

Readmore >
Image 1

మురికికాలువ త్రవ్వేసి మధురానగర్ రోడ్డు కబ్జా?

Posted On 2026-04-22 20:10:32

Readmore >
Image 1

ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

Posted On 2026-04-22 12:20:38

Readmore >
Image 1

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం

Posted On 2026-04-22 10:42:24

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మహిళ సీఐ మరియు ఎస్ఐ

Posted On 2026-04-22 07:35:51

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-04-21 19:56:02

Readmore >
Image 1

జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

Posted On 2026-04-21 19:53:11

Readmore >
Image 1

సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-04-21 18:31:56

Readmore >