Posted on 2026-04-20 18:40:20
తప్పుడు లెక్కల వల్ల ఉద్యోగ,ఉపాధి, అభివృద్ధి అవకాశాలు కోల్పోతున్నాము
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్ కు నాయకపోడు కులస్థులు వినతి పత్రం సమర్పించారు,అనంతరం కుల పెద్ద తంబళ్ల రవి మాట్లాడుతూ...ఇటీవల ప్రభుత్వం వివిధ మాధ్యమాల ద్వారా ప్రకటించిన జనాభా వివరాలలో నాయకపోడు తెగ జనాభాను అతి తక్కువగా (కేవలం 16,000 గా) చూపడం జరిగిందని,ఇది వాస్తవానికి పూర్తిగా విరుద్ధంగా ఉందని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే మా జనాభా సుమారు 70,000 పైచిలుకుగా ఉందని వారు తెలిపారు,రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షల నాయకపోడు జనాభా కలిగి ఉన్నామని,1949లో షెడ్యూల్డ్ తెగల జాబితాలో స్వతంత్రంగా ఉన్న మా తెగను,1950 లో గోండు తెగకు ఉప తెగగా మార్చి సీరియల్ నంబర్ 6 లో చేర్చడం జరిగిందని అన్నారు,దీనివల్ల మా ప్రత్యేక సంస్కృతి,ఉనికి కనుమరుగవుతున్నాయని, ఫలితంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు,విద్యా,ఉద్యోగ అవకాశాలు మా జాతికి సరిగ్గా అందడం లేదని వాపోయారు. ప్రస్తుత ప్రభుత్వ సర్వేలోని తప్పులను వెంటనే సవరించి, మా వాస్తవ జనాభా లెక్కలను ప్రకటించాలని, రాబోయే కేంద్ర ప్రభుత్వ కుల గణన మరియు జనగణనలో నాయకపోడు తెగకు ప్రత్యేక కాలమ్ (Column) కేటాయించి మా వివరాలను నమోదు చేయాలని,
షెడ్యూల్డ్ తెగల జాబితాలో మా తెగకు తిరిగి ప్రత్యేక సీరియల్ నంబర్ కేటాయించి మా అస్తిత్వాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేశారు,మా జాతి ఉనికిని,హక్కులను కాపాడటానికి జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి,ప్రభుత్వ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని మేము విజ్ఞప్తి చేస్తున్నామని కోరారు,ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడు కులస్థులు,యువత, కులపెద్దలు,తదితరులు పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >