| Daily భారత్
Logo




నిడదవోలులో మహిళా సాధికారతకు మద్దతుగా సీఎం చంద్రబాబు నిరసన ర్యాలీ

News

Posted on 2026-04-18 13:41:10

Share: Share


నిడదవోలులో మహిళా సాధికారతకు మద్దతుగా సీఎం చంద్రబాబు నిరసన ర్యాలీ

డైలీ భారత్, నిడదవోలు : తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి పరిధిలోని నిడదవోలులో మహిళా సాధికారత బిల్లుకు మద్దతుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. పార్లమెంటులో మహిళల హక్కులకు విఘాతం కలిగిందని, ఇది దేశానికి “బ్లాక్ డే”గా మిగిలిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న ఆశలను ప్రతిపక్షాలు ధ్వంసం చేశాయని సీఎం విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు దాని మిత్రపక్షాలు భారతీయ సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరించాయని, మహిళలకు ఇది ద్రోహమని తీవ్రంగా స్పందించారు.

“ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు” అన్న మన సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ, అలాంటి విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిదని అన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని, కానీ రాజకీయాల్లో మాత్రం వివక్ష చూపడం బాధాకరమని పేర్కొన్నారు.

ప్రతిపక్షాలు చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే పేరుతో బిల్లును వ్యతిరేకించాయని, కానీ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేసినా కూడా రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు.

మూడున్నర దశాబ్దాలుగా మహిళా సాధికారత కోసం పోరాడుతున్నామని చెప్పిన సీఎం, నిన్న పార్లమెంట్ సాక్షిగా ఆడబిడ్డలకు అన్యాయం జరిగిందని అన్నారు. “ఏ ముఖం పెట్టుకుని ప్రతిపక్షాలు రేపు మహిళల ఓట్లు అడుగుతాయి?” అంటూ ప్రశ్నించారు.

పంచాయతీ స్థాయిలో ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని, ఉద్యోగ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని గుర్తుచేశారు. అలాంటి సమయంలో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా బిల్లును అడ్డుకోవడం క్షమించరాని చర్యగా అభివర్ణించారు.

వచ్చే ఎన్నికల్లో మహిళలతో ద్రోహం చేసిన పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన సీఎం, నిడదవోలులో ప్రారంభమైన ఈ పోరాటాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. “ఇది ప్రారంభం మాత్రమే… ఇక్కడితో ఆగదు” అని హెచ్చరించారు.

Image 1

స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

Posted On 2026-04-19 22:26:42

Readmore >
Image 1

పీసా అమలు ఎక్కడ.?

Posted On 2026-04-19 22:25:03

Readmore >
Image 1

శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

Posted On 2026-04-19 22:22:58

Readmore >
Image 1

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. 5 నెలలు ఫ్రీ

Posted On 2026-04-19 22:21:17

Readmore >
Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >