Posted on 2026-04-07 10:51:04
విద్యార్థులకు ప్రతిభతో పాటు క్రమశిక్షణ అవసరం
సాయి ఎక్సలెంట్ పాఠశాల డైరెక్టర్ జక్కుల శివకుమారి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడుమండలంలోని సాయి ఎక్సలెంట్ పాఠశాలలో 2026 - 2027 వ విద్యా సంవత్సరంలో 5వ తరగతి ప్రవేశానికి గురుకులాలలో 50 మంది పరీక్ష రాయగా 48 మంది విద్యార్థులు అర్హత సాధించడం జరిగిందని సాయి ఎక్సలెంట్ పాఠశాల డైరెక్టర్ జక్కుల శివకుమారి మంగళవారం అన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ కూడా చాలా అవసరమన్నారు సాయి ఎక్సలెంట్ లో నవోదయ, గురుకుల, ఏకలవ్య, మోడల్ స్కూల్లో ప్రవేశానికి అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా విద్యార్థులు విని నేర్చుకోవడం కాకుండా చూసి నేర్చుకుంటే ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది అని మేధావులు, విద్యావంతులు, కార్పొరేట్ విద్యాసంస్థలు డిజిటలైజేషన్ క్లాసులు నిర్వహిస్తున్నాయని, అదే స్థాయిలో 2026 - 2027వ విద్యా సంవత్సరంలో మా సాయి ఎక్సలెంట్ పాఠశాలలో కూడ నిర్వహిస్తున్నామన్నారు. కావున మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ పిల్లలను కూడా మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సాయి ఎక్సలెంట్ పాఠశాల డైరెక్టర్లు ఆరెబోయిన హుస్సేన్, ఆరెబోయిన నాగలక్ష్మి, ఉపాధ్యాయులు నాగరాజు, అనిత, అశోక్, నభీన, రమేష్, దుర్గ భవాని, సత్యావతి, ప్రశాంతి, నభీన, ఉదయభాను, పావని, విద్య, కళ్యాణి, భార్గవి, నందిని, శిరీష, అరుణ, రమాదేవి, సౌజన్య, త్రివేణి, ఉమా, హైమావతి, శాంతమ్మ, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >