| Daily భారత్
Logo




సిరిసిల్ల పవర్‌లూమ్ పరిశ్రమల అభివృద్ధికి పూర్తి మద్దతు

News

Posted on 2026-04-06 05:00:49

Share: Share


సిరిసిల్ల పవర్‌లూమ్ పరిశ్రమల అభివృద్ధికి  పూర్తి మద్దతు

క్షేత్రస్థాయిలో పరిశీలించిన టీజీఎన్పీడీసియల్  సీఎండీ వరుణ్ రెడ్డి.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పవర్‌లూమ్ పరిశ్రమల అభివృద్ధికి విద్యుత్ శాఖ పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తుందని టీజీ ఎన్పీడీసీఎల్  సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఆయన స్థానిక పవర్‌లూమ్ (విద్యుత్ మగ్గాల) పరిశ్రమను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మగ్గాల పనితీరు, విద్యుత్ వినియోగ విధానం, ఉత్పత్తి ప్రక్రియలను స్వయంగా పరిశీలించిన సీఎండీ, పరిశ్రమలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ద్వారా విద్యుత్ ఆదా సాధించడంతో పాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే అవకాశాలపై అధికారులతో చర్చించారు. తరువాత నేతన్నలతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన వరుణ్ రెడ్డి వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. ముఖ్యంగా విద్యుత్ రాయితీలు, లో- ఓల్టేజ్ సమస్యలు  నిరంతర విద్యుత్ సరఫరా వంటి అంశాలపై కార్మికులు తమ విన్నపాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన సీఎండీ, విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేతన్నల సంక్షేమం పట్ల  కట్టుబడి ఉన్నామని , పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరాను అందించడం టీజీఎన్పీడీసియల్  బాధ్యతగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. సిరిసిల్ల పవర్‌లూమ్ పరిశ్రమ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్న ఆయన, నేతన్నల జీవనోపాధి మెరుగుదలకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.


#Sircilla #sircillanews #rajannasircilla #sircilla rajanna district

Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >