Posted on 2026-04-05 19:02:32
డైలీ భారత్, సిరిసిల్ల: సెస్ లో సిరిసిల్ల మరమగ్గాల నిర్వాహకుల విషయంలో సత్వరం స్పందించిన ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డికి వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షులు తాటిపాముల దామోదర్ మరమగ్గాల అనుబంధం సంఘాల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షులు తాటిపాముల దామోదర్ తో పాటు నాయకులు మాట్లాడుతూ సెస్ పరిధిలో ఉన్న మరమగ్గాల నిర్వాహకులకు సంబంధించి అనేక రోజులుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను ,అనుమానాలను ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి తొలగించారని అన్నారు. సిరిసిల్లలోని మరమగ్గాల పరిశ్రమ అనుబంధ పరిశ్రమల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్ల మరమగ్గాల యూనిట్లకు సంబంధించి 25 హెచ్పి ల వరకు 50 శాతం సబ్సిడీతో మూడవ కేటగిరీ నుంచి నాలుగవ కేటగిరికి మార్చనున్నట్లు తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. వీటితోపాటు బ్యాక్ బిల్లింగ్ విషయంలో సానుకూలంగా అధికారులు స్పందించడం కృతజ్ఞతలు తెలిపారు. ఎన్పీడీసీఎల్ అధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల సుమారు 600 పైగా మరమగ్గాల యూనిట్లు పెరిగి అవకాశం ఉందని సుమారు 5000 మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. అనేక విషయాలలో ఎన్పీడీసీఎల్ అధికారులు సానుకూలంగా స్పందించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సహకరించిన చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇంచార్జ్ కే.కే మహేందర్ రెడ్డి, డి.సి.సి .అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ తో పాటు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో బూట్ల నవీన్, యెల్దండీ దేవదాస్, సాప గణేష్, రాపేల్లి ప్రసాద్, బండారి అశోక్, పినగాని రాజేశం తదితరులు పాల్గొన్నారు.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >