| Daily భారత్
Logo




కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడి నీ ఖండించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

News

Posted on 2026-04-04 12:41:13

Share: Share


కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడి నీ ఖండించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

డైలీ భారత్, వైరా: గజ్వేల్‌లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడి నీ ఖండించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విధ్వంసమే పరామవధిగా కొనసాగుతున్న కాంగ్రెస్‌ నాయకుల దాడి ఈసారి బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్‌) క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు. గజ్వేల్‌ లోని క్యాంపు కార్యాలయంలోకి చొరబడ్డ కాంగ్రెస్‌ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు.

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) క్యాంపు కార్యాలయం ప్రభుత్వ ఆస్తి, దానిని ధ్వంసం చేయడం అంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమేనని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.

మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మీద ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన దుండగులను గుర్తించి, కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో పోలీసులు అలసత్వం వహించడం గర్హనీయమని పేర్కొన్నారు.

Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >