Posted on 2026-04-03 09:23:18
నేరాలకు పాల్పడిన వారికీ జైలు శిక్షలు తప్పదు,శిక్షలతోనే సమాజంలో మార్పు.
నిందుతులకు శిక్ష పడటంలో కృషి చేసిన అధికారులను , పిపిలను,కోర్ట్ కానిస్టేబుల్లను అభినందించిన జిల్లా ఎస్పీ.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రుద్రంగి పోలీస్ స్టేషన్ లో నమోదైన వరకట్నం వేధింపు హత్య కేసులో భర్తతో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విధించినట్లు గురువారం రోజున సిరిసిల్ల జిల్లా ప్రధాన నాయమూర్తి నీరజ గారు తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
వివరాల మేరకు
రుద్రంగి గ్రామానికి చెందిన ఏనుగందుల రాజయ్యకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన కుమార్తె హేమలత (పద్మ)ను అదే గ్రామానికి చెందిన సింగారపు జనార్ధన్‌కు కట్నాలు, కానుకలు ఇచ్చి వివాహం చేశారు. అయితే, వివాహం జరిగిన కొద్ది రోజుల తరువాత అదనపు కట్నం తీసుకురావాలని భర్త సింగారపు జనార్ధన్, ఆడపడుచు సింగారపు శారద, మేనల్లుడు తెడ్డు సాగర్, అలాగే జనార్ధన్ అన్న కుమార్తె సింగారపు దివ్య కలిసి హేమలతను వేధించడం ప్రారంభించారు.
ఈ విషయంపై గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా, ఇకపై హేమలతను బాగా చూసుకుంటానని జనార్ధన్ హామీ ఇచ్చి, ఆమెను తిరిగి తనతో కాపురానికి తీసుకెళ్లాడు.
తేదీ 3-4-2018 రోజున మళ్ళీ అదనపు వరకట్నం తీసుకొని రావాలని వేధించినడు,అట్టి విషయంలో గొడవ జరుగగా పై నాలుగురు కలిసి హేమలతను కొట్టి చంపాలనే ఉద్దేశంతో రోకలి బండతో తల పైన కొట్టి చంపినారు.
ఇట్టి కేసు లొ మృతురాలు యొక్క తమ్ముడు అయినా ఏనుగుందుల సతీష్ పిర్యాదు మేరకు అప్పటి రుద్రంగి ఎస్.ఐ విద్యాసాగర్ కేసు నమోదు చేసినారు, ఇట్టి కేసు లొ అప్పటి డిఎస్పీ వెంకటరమణ కోర్ట్ లొ ఛార్జిషిట్ దాకాలు చేయగా, ఇట్టి కేసులో ప్రాసిక్యూషన్ తరుపున పెంట శ్రీనివాస్ వాదించగా చందుర్తి సి.ఐ వెంకటర్వర్లు, CMS SI రవీందర్ నాయడు ఆధ్వర్యంలో కోర్ట్ మానిటీరింగ్ కానిస్టేబులు నవీన్, లతీఫ్ , శ్రీనివాస్ లు కోర్ట్ లో 19 మంది సాక్షులను ప్రవేశ పెట్టగా కేసు పూర్వ పరాలు పరిశీలిచిన తరువాత సిరిసిల్ల జిల్లా ప్రధాన నాయమూర్తి నీరజ గారు నిందుతులకు ఒక్కొక్కరికి జీవిత ఖైదు తో పాటు ఒక్కొక్కరికి 2000/- రూపాయలు జరినామా విధించారు.
ఇట్టి కేసు లొ A4 అయినట్టు వంటి సింగరపు దివ్య మైనర్ కావడం వలన ఆమె పైన కేసు ప్రస్తుతం జూవినల్ కోర్ట్ లో నడుస్తున్నది
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...
సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని,శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.
పైకేసులలో నిందితులకి శిక్ష పడటంలో కృషి చేసిన పీపీలు పెంట శ్రీనివాస్, చందుర్తి సి.ఐ వెంకటర్వర్లు, CMS SI రవీందర్ నాయడు,కోర్ట్ మానిటీరింగ్ కానిస్టేబులు నవీన్, లతీఫ్ , శ్రీనివాస్ లు అప్పటి పోలీస్ అధికారులు ఎస్.ఐ మరియు డిఎస్పీ లను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు
Posted On 2026-04-13 11:03:05
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >