| Daily భారత్
Logo




స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు

News

Posted on 2026-04-02 20:27:47

Share: Share


స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు

కల్తీ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి

నగర సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరిక

ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లతో సమావేశం

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, స్వలాభం కోసం కల్తీకి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ హెచ్చరించారు. కల్తీ అనేది కేవలం వ్యాపారం కాదని, అది సమాజంపై జరుగుతున్న దాడి అని ఆయన అన్నారు. 

గురువారం బషీర్‌బాగ్‌లోని పాత పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో "హెచ్‌-ఫాస్ట్‌" ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి మాంసం, పాలు, బేకరీ ఉత్పత్తులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ పొడి తదితర విభాగాలకు చెందిన సుమారు 200 మంది వ్యాపార ప్రతినిధులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, గత నెల రోజుల వ్యవధిలోనే నగరవ్యాప్తంగా 92 కేసులు నమోదు చేసి, సుమారు 62 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ అక్రమాలకు పాల్పడుతున్న 98 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. 

ఆహార పదార్థాల నాణ్యత విషయంలో రాజీ పడకుండా, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యాపారులు వ్యవహరించాలని హితవు పలికారు. కల్తీ రహిత తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని,  ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

హైదరాబాద్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖ్యాతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి వ్యాపారిపై ఉందని అన్నారు. ప్రతి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ కలిగి ఉండాలని, ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే తక్షణమే పోలీసులకు తెలపాలని కోరారు. 

నిజాయితీగా వ్యాపారం నిర్వహించే వారికి పోలీసు శాఖ, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఆరోగ్యవంతమైన హైదరాబాద్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. 

వ్యాపార ప్రతినిధులు క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను సీపీ దృష్టికి తీసుకురాగా, వాటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పోలీసుల చొరవను వ్యాపారులు అభినందిస్తూ, కల్తీని అరికట్టడంలో తమ వంతు సహకారాన్ని అందిస్తామని వారు చెప్పారు. 


Image 1

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో IQAC - FDP

Posted On 2026-04-13 16:09:23

Readmore >
Image 1

రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు

Posted On 2026-04-13 11:03:05

Readmore >
Image 1

యాక్సిస్ బ్యాంక్‌లో భారీ మోసం

Posted On 2026-04-13 08:36:04

Readmore >
Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >