| Daily భారత్
Logo




ప్రపంచంలోనే మొట్ట మొదటి స్పోర్ట్స్ హ్యాకథన్ క్రీడాల్లో విజయం సాధించిన కామారెడ్డి జిల్లా క్రీడా కారులను అభినందించిన జిల్లా కలెక్టర్

News

Posted on 2026-04-01 19:56:38

Share: Share


ప్రపంచంలోనే  మొట్ట మొదటి స్పోర్ట్స్ హ్యాకథన్ క్రీడాల్లో  విజయం సాధించిన కామారెడ్డి  జిల్లా క్రీడా కారులను అభినందించిన జిల్లా కలెక్టర్

డైలీ భారత్, కామారెడ్డి: క్రీడలు,సాంకేతికత, ఆవిష్కరణలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చిన స్పోర్ట్స్ హ్యకథాన్ కార్యక్రమంలో జిల్లా క్రీడాకారులు పాల్గొని విశేష పతకాలు సాధించి జిల్లాకే గర్వకారణంగా నిలిచిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అభినందించారు.

గచ్చిబౌలి స్టేడియంలో 24 గంటల పాటు నిరంతర కార్యక్రమంగా నిర్వహించిన ఈ వినూత్న స్పోర్ట్స్ హ్యకథాన్ లో రాష్ట్రం నలుమూలల నుండి విద్యార్థులు, క్రీడాకారులు,స్టార్టప్ లు, యువ ఆవిష్కర్తలు పాల్గొని మొత్తం 2,132 ఆవిష్కరణలను రూపొందించారని తెలిపారు. యువతలో సృజనాత్మకతను వెలికి తీసే ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని అన్నారు. క్రీడల్లో పనితీరు,మెరుగుదల,శిక్షణ విధానాలు,ఫ్యాన్ ఎంగేజ్ మెంట్, స్పోర్ట్స్ టెక్నాలజీ వంటి విభాగాల్లో కొత్త దారులకు ఈ ఆవిష్కరణలు బాట వేస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గెలుపొందిన షటిల్  బ్యాట్మెంటన్ క్రీడాకారులు అవని రెడ్డి మరియు ఆరాధ్య రెడ్డి గోల్డ్ మెడల్* అండర్ 17 గర్ల్స్ డబుల్స్,2k రన్ మరియు కరాటె లో ధనుష్ కుమార్ అండర్ 14 లో  గోల్డ్ మెడల్, శ్రీ వెంకట్ సిల్వర్ మెడల్ అండర్ 9 boys సింగిల్స్,జై ప్రీత్ మరియు జిశాన్ కాంస్య పతకం అండర్ 13 boys డబుల్స్,*విష్ణు మరియు నియాన్ కాంస్య పతకం అండర్ 15 boys డబుల్స్,చేతన కాంస్య పతకం అండర్ 15 గర్ల్స్ సింగిల్స్,*అక్షర మరియు చేతన కాంస్య పతకం అండర్ 15 గర్ల్స్ డబుల్స్ లో విజయం సాధించిన వారిని కలెక్టర్ అభినందించారు.

అంతే కాకుండా జిల్లాలో క్రీడాకారులను వెలికి తీసి వారిని స్పోర్ట్స్ హ్యకథాన్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన (TITA) తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఉత్తర తెలంగాణ జోన్ సెక్రెటరీ చెల్లాపురం శ్రీకాంత్ నీ కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి రంగా వెంకటేశ్వర్ గౌడ్, కోచ్ సందీప్ గౌడ్,క్రీడాకారులు పాల్గొన్నారు.

Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >