| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

LPG గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు

LPG గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు

TRS ( D) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఎల్పిజి గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించడం వల్ల హోటల్ యజమానులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నరాల సత్యనారాయణ తెలియజేశారు. చాలా కుటుంబాలు గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ నెలల తరబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వం గుర్తించి వారికి ఎల్పిజి గ్యాస్ ను అందజేయవలసిందిగా కోరుతున్నాం. చాలాచోట్ల చిన్నచిన్న హోటల్స్ తో పాటు పెద్ద పెద్ద హోటల్స్ గ్యాస్ కొరత వల్ల యాజమాన్యాలు ఇబ్బంది పడుతూ ప్రయాణికులకు సరైనటువంటి ఆహారాన్ని అందజేయలేకపోతున్నాయి. కావున ఈ కృత్రిమ గ్యాస్ కొరత వల్ల ఆహారపు కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం వెంటనే స్పందించి కుటుంబాలు ఎల్పిజి గ్యాస్ బుక్ చేసుకుంటే ఒక్కరోజులోనే గ్యాస్ ను అందజేయాలని అదేవిధంగా హోటల్ యాజమాన్యాలకు కూడా గ్యాస్ కొరత లేకుండా చేయాలని టిఆర్ఎస్ ( డి) రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలియజేశారు

Previous వెలగ మధుబాబు దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన దిశా ఉమెన్ ప్రొడక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి కోడెం సీతా కుమారి
Next ఇప్పలగుంపు గ్రామ రహదారిపై కూలిన వంతెన పునర్నిర్మాణం చేయాలని ప్రజావాణిలో వినతి
ADVERTISEMENT